లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డి బినామీలు వారేనా?
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో బయటకు వస్తున్న సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో బయటకు వస్తున్న సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిన్న రాజ్ కసిరెడ్డిని, చాణక్యను ప్రశ్నించిన సిట్ అధికారులు పలు కీలక విషయాలను రాబట్టారు. చాలా సంస్థలను బినామీల పేరుతో రాజ్ కసిరెడ్డి నడిపించినట్లు సమాచారం అందింది. కొన్నిటి బాధ్యతలు చాణక్యకు, మరికొన్ని దిలీప్‌కు అప్పగించారు.
ఈ నెల 8వ తేదీతో...
రాజ్ కసిరెడ్డి, చాణక్యలపై విడతల వారీగా ప్రశ్నల వర్షం కురిపించిన సిట్ అధికారులు ఈ నెల 8న కసిరెడ్డి రాజ్ సిట్ కస్టడీ ముగియనుంది. ఈలోపు మరిన్ని వివరాలు రాబట్టాలని అనుకుంటున్న సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మద్యం కుంభకోణం వెనక ఎవరున్నారన్న దానిపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు.