ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు ముద్రగడ
అస్వస్థతకు గురైన వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభాన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించనున్నారు
అనారోగ్యంతో అస్వస్థతకు గురైన వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభాన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించనున్నారు. సోమవారం ఉదయం ఎయిర్ అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ తీసుకువెళ్తారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సూచనలతో పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు.ఎయిర్ అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ తీసుకురానన్నారు.
అనారోగ్యంతో ఉన్న...
అనారోగ్యంతో అస్వస్థతకు గురైన ముద్రగడ పద్మనాభానికి రెండు రోజులుగా కాకినాడ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ముద్రగడ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ముద్రగడ తనయుడు, పార్టీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ గిరిబాబును ఫోన్‌లో పలకరించారు.