11న టీడీపీఎల్పీ సమావేశం.. నాయకుడిగా చంద్రబాబు ఎన్నిక
ఈనెల 11న టీడీఎల్పీ సమావేశమై గవర్నర్‌కు నివేదిక పంపుతామని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు
tdp mla gorantla butchaiah chaudhary
ఈనెల 11న టీడీఎల్పీ సమావేశమై గవర్నర్‌కు నివేదిక పంపుతామని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈనెల 12 ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. ప్రమాణస్వీకారానికి ప్రధాని సహా పలు పార్టీల నేతల్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు ప్రధాని ప్రమాణస్వీకారంతో పాటు ఒడిశా కూడా చంద్రబాబు వెళ్తారని గోరంట్ల తెలిపారు.
జగన్ ఇంకా మారలేదు...
ఓటమి చూసిన జగన్ ఇంకా మారలేదని గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. అసహనంతో తెదేపా శ్రేణులపై దాడులకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. తాము దాడులు చేస్తున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తెలిపారు. శాంతిభద్రతలను కాపాడటమే ఈ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని ఆయన అన్నారు.