ముద్రగడ మరో లేఖ.. ఈసారి?
సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు
సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిలుపుదల చేయాలని ఆయన లేఖలో కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందరో ప్రాణాలు త్యాగాలు చేసిన ఫలితంగా వచ్చిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఏపీ ప్రజలు సెంటిమెంట్ గా చూస్తారన్నారు.
బాధేస్తుంది....
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేస్తారని తెలిసి మనసు బాధ వేస్తుందని చెప్పారు. కోట్లాది మంది ప్రజలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారని, ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆలోచనను, ప్రయత్నాన్ని మానుకోవాలని ముద్రగడ పద్మనాభం ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.