సీఎం జగన్ కు సీపీఎం మధు కౌంటర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీపీఎం సీనియర్ నేత మధు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2022-02-09 06:26 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీపీఎం సీనియర్ నేత మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బీజేపీకి వత్తాసు పలకడం మానుకోవాలని మధు హితవు పలికారు. కమ్యునిస్టు పార్టీలపై నిందలు వేయడం తగదని ఆయన సూచించారరు. సమస్యలను పరిష్కరించకుండా ఏ ప్రభుత్వం మొండికేసినా వారికి కమ్యునిస్టు పార్టీలు అండగా ఉంటాయని గుర్తు చేశారు.

నిందలు వేయడం....
కమ్యునిస్టులకు ప్రభుత్వాలతో సంబంధం లేదని, ప్రజా సమస్యలే ముఖ్యమని మధు అన్నారు. ఔట్ సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష‌్కరించారా? అని మధు ప్రశ్నించారు. నిన్న కమ్యునిస్టుల పై ముఖ్యమంత్రి జగన్ మండి పడిన సంగతి తెలిసిందే. ఎదుట ఎర్రజెండా, పసుపు అజెండా అంటూ జగన్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై మధు కౌంటర్ ఇచ్చారు.


Tags:    

Similar News

.