ఆర్టీసీపై సంచలన ప్రకటన చేసిన మంత్రి.. వారికి 25 శాతం రాయితీ

ఇకపై ఆర్టీసీలో కూడా కారుణ్య నియామకాలను చేపడతామన్న మంత్రి.. రాష్ట్రంలో 1,800కు పైగా కారుణ్య నియామకాలను

Update: 2022-03-16 12:42 GMT

అమరావతి : ఏపీఎస్ ఆర్టీసీపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని ఆర్టీసీపై కీలక ప్రకటన చేశారు. 60 ఏళ్లు దాటిన వారికి ఏప్రిల్ నుంచి టికెట్ ధరలో 25 శాతం రాయితీని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కరోనా కారణంగా ఆపివేసిన రాయితీని సీనియర్ సిటిజన్లకు వచ్చేనెల నుంచి పునరుద్ధరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వయసు నిర్థారణ కోసం ఆధార్, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డును చూపించి రాయితీ పొందవచ్చని పేర్కొన్నారు.

ఇకపై ఆర్టీసీలో కూడా కారుణ్య నియామకాలను చేపడతామన్న మంత్రి.. రాష్ట్రంలో 1,800కు పైగా కారుణ్య నియామకాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మిగిలిన శాఖల్లో ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని తెలిపారు. ఆర్టీసీ బస్సులకు అవసరమైన ఇంధనాన్ని బయటి బంకుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించామని, తద్వారా ఆర్టీసీకి రోజుకు రూ.1.50 కోట్లు ఆదా అవుతుందని చెప్పారు. అలాగే.. తిరుమల ఘాట్ రోడ్డు, తిరుపతి-మదనపల్లి, తిరుపతి-నెల్లూరుకు ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు వేస్తామని తెలిపారు.


Tags:    

Similar News