భద్రత సిబ్బంది పై వేటు

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటి వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది

Update: 2022-07-06 03:44 GMT

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటి వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని రఘురామ కృష్ణరాజు ఇంటి సమీపంలో ఒక వ్యక్తి ఫొటో తీస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. అతనిపై దాడి చేసి కొన్ని గంటల పాటు నిర్భంధించారని సీఆర్పీఎఫ్ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ భాషాపై దాడి చేయడంతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇద్దరిని సస్పెండ్ చేస్తూ....
దీంతో సీఆర్పీఎఫ్ కు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ నోయిడా 221 బెటాలియన్ కమాండెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. రఘురామ కృష్ణరాజు ఇంటి వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ గంగారామ్, కానిస్టేబుల్ ను సందీప్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిపై నమోదయిన కేసుపై విచారణ జరుగుతుంది.


Tags:    

Similar News