గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది

Update: 2026-01-03 04:15 GMT

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది. మద్యం మత్తులో సిబ్బంది కళ్లుగప్పి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తి చాలా సేపు హల్ చల్ చేశారు. తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి మద్యం తాగి ఆలయ శిఖరంపైకి ఎక్కి రచ్చ రచ్చ చేశాడు. అతనిని ఆలయ శిఖరం నుంచి కిందకు దించే సరికి పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చింది.

ఆలయ గోపురం ఎత్తి...
విజిలెన్స్‌ సిబ్బంది చూసేలోపే ఆలయం గోడ దూకి లోపలికి ప్రవేశించిన వ్యక్తి మహా ద్వారం లోపల ఆలయం గోపురం ఎక్కి కలశాలు లాగే ప్రయత్నం చేశాడు.
కిందకు దింపేందుకు మూడు గంటల పాటు శ్రమించిన అధికారులు చివరకు నచ్చ చెప్పి కిందకు దించారు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మద్యం మత్తులోనే అతను ఆలయ గోపురం ఎక్కినట్లు పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News