Nellore : రెండోరోజు ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం

నెల్లూరులో రెండోరోజు ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభమయింది.

Update: 2025-07-07 02:49 GMT

నెల్లూరులో రెండోరోజు ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభమయింది. రొట్టెల పండుగకు భారీగా ప్రజలు తరలివస్తుండటంతో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిన్న బారాషాహిద్ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండగ మొత్తం ఐదు రోజుల పాటు కొనసాగనుంది. నిన్నటి నుంచే భక్తుల అధిక సంఖ్యలో తరలి వచ్చి రొట్టెలను మర్పించుకుంటున్నారు.

ట్రాఫిక్ సమస్యలను...
ఎక్కువగా సంతానం లేని వారు, ఆరోగ్యం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు రొట్టెలను సమర్పించుకుంటున్నారని అక్కడి వారుచెబుతున్నారు. రొట్టెల పండగ సందర్భంగా ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా దాదాపు పదహారు వందల మంది పోలీసులను అక్కడ భద్రత కోసం నియమించారు.


Tags:    

Similar News