మాయాపట్నంలోకి సముద్రపు నీరు
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మాయపట్నం వద్ద సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి.
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మాయపట్నం వద్ద సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. భారీ వర్షాలు, అల్పపీడనం కారణంగా సముద్రపు నీరు గ్రామాల్లోకి చేరుతోంది. భారీ కెరటాలతో మాయాపట్నం గ్రామం జలమయమయింది. ఇళ్లలోకి సముద్రపు నీటి చేరికతో స్థానికంగా నివసించే ప్రజలు బయటికి రాలేకపోతున్నారు.
సముద్రపు నీటిని మళ్లించేందుకు...
మాయపట్నంలో సముద్రపు నీటిని వెనక్కి మళ్లించేందుకు అధికారుల చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేసి ఉంచారు. జియో ట్యూబ్, రక్షణ గోడలు ధ్వంసం కావడంతో తరచుగా గ్రామంలోకి సముద్రపు నీరు చేరుతుందని గ్రామస్థులు చెబుతున్నారు.