పాఠశాలల పునఃప్రారంభం పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

అలాగే వేడిగాలుల తీవ్రత కూడా అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు పాఠశాలల పునః ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2023-06-11 07:53 GMT

పాఠశాలల విద్యార్థులకు నేటితో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. రేపటి నుంచి అన్ని పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. కానీ.. జూన్ రెండో వారం వచ్చినా ఎండల తీవ్రత ఇంకా తగ్గలేదు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను తాకుతున్నాయి. అలాగే వేడిగాలుల తీవ్రత కూడా అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు పాఠశాలల పునః ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 17వ తేదీ వరకూ ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఉదయం 7.30 నుండి 11.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. 19వ తేదీ నుంచి పాఠశాలలు యథాతదంగా నడుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఎండలు, వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్షాలతో పాటు వాతావరణశాఖ కూడా వేసవి సెలవులను పొడిగించాలని కోరింది. కానీ ప్రభుత్వం మాత్రం పునః ప్రారంభానికే మొగ్గు చూపింది. కొన్ని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం వేసవి సెలవులను 17వ తేదీ వరకు పొడిగించాయి.


Tags:    

Similar News