ఏపీలో 24న ఎమ్మెల్సీ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ్యుల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. మార్చి 24వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది

Update: 2022-03-01 01:41 GMT

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ్యుల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. మార్చి 24వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. మార్చి 7 తేదీన ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 14 వ తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. మార్చి 15 వతేదీన ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలస్తారు. 17వ తేదీన ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు.

ఖాళీ అయిన స్థానానికి....
విజయవాడకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా మరణంతో ఈ ఎన్నిక అనివార్యమయింది. ముఖ్యమంత్రి జగన్ కరీమున్నీసా కుమారుడికి ఈ సీటు ఇస్తానని చెప్పారు. దీంతో ఈ ఎన్నిక ఏకగీవ్రం కానుంది. శాసనసభ్యుల కోటా కింద జరిగే ఎన్నికలు కావడంతో ప్రతిపక్ష పార్టీలు పోటీ చేసే అవకాశం లేదు.


Tags:    

Similar News