ఏపీ,తెలంగాణ హైకోర్టులకు కొత్త సీజేలు

ఏపీకి సిఫార్సు చేసిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జమ్మూకశ్మీర్ కు చెందిన వారు. ఆయన 2013లో అక్కడి హైకోర్టు జడ్జిగా బాధ్యతలు

Update: 2023-07-06 04:57 GMT

dhiraj singh thakur and alok arade

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కొత్త సీజేల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీకి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణకు జస్టిస్ అలోక్ అరదేను కొలీజియం సిఫార్సు చేసింది. మధ్యప్రజేశ్ కు చెందిన జస్టిస్ అలోక్ అరదే.. అక్కడి హైకోర్టు జడ్జిగా 2009లో నియమితులయ్యారు. 2018 నవంబర్ నుంచి ఆయన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.

ఏపీకి సిఫార్సు చేసిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జమ్మూకశ్మీర్ కు చెందిన వారు. ఆయన 2013లో అక్కడి హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2022 జూన్ నుంచి ధీరజ్ సింగ్ బాంబే హైకోర్టు జడ్జిగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ధీరజ్ సింగ్ ఠాకూర్ ను మణిపూర్ హైకోర్టు సీజేగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా.. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్న దానిని కొలీజియం రద్దు చేసింది. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ను సిఫార్సు చేసింది.


Tags:    

Similar News