నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై విచారణ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై నేడు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరగనుంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై నేడు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరగనుంది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ వంశీ వేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసుతో పాటు సత్యవర్థన్ ను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో గత కొద్ది రోజులు వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
కస్టడీకి ఇవ్వాలంటూ...
ఆయన తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటీషన్ వేశారు. అదే సమయంలో పోలీసులు కూడా ఈ కేసు విషయంలో వల్లభనేని వంశీని మరోసారి విచారించాలని, తమకు కస్టడీకి అప్పగించాలని కూడా పిటీషన్ వేశారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై నేడు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.