Ambati Rambabu : అంబటి రాంబాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2025-06-19 04:46 GMT

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల విధులను అడ్డుకున్నందుకు ఆయనపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు నిన్న సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్లకు జగన్ వస్తున్న సందర్భంగా పోలీసులు అడ్డగా పెట్టినబారికేడ్లను తొలగించారు.

పోలీసు విధులను అడ్డుకున్నందుకు...
అక్కడి నుంచి కార్యకర్తలను పంపించి వేయడమే కాకుండా వారి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసులను దుర్భాష లాడారంటూ అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదుచేశారు. జగన్ రెంటపాళ్ల గ్రామ పర్యటన విషయంలో ఇంకా అనేక మందిపై పోలీసులు కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News