Ambati Rambabu : అంబటి రాంబాబుపై మరో కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఈ మేరకు అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కల్గించారన్న దానిపై పోలీసులు మరొక కేసు నమోదు చేశారు.
ఈ నెల 21వ తేదీకి...
ఈ కేసులో విచారణకు అంబటి రాంబాబును ఈ నెల 21వ తేదీన విచారణకు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో సత్తెన పల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబుపై కేసు నమోదయింది. ఇప్పుడు తాజాగా సత్తెనపల్లి గ్రామీణ పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది. రేపు అంబటి రాంబాబు విచారణకు హాజరు కావాల్సి ఉంది.