నేటి నుంచి ఏపీలో సమ్మె

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. అధికారులతో చర్చలు విఫలం కావడంతో నిరవధిక సమ్మెకు దిగారు

Update: 2022-07-11 03:11 GMT

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. అధికారులతో చర్చలు విఫలం కావడంతో నిరవధిక సమ్మెకు దిగారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పనిచేస్తున్న దాదాపు 35 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటం, చెత్త పేరుకుపోయి వ్యాధులు సంక్రమిస్తాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని వారు చెబుతున్నారు.

హౌస్ అరెస్ట్ లు..
వీరికి సంఘీభావంగా శాశ్వత పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయివేటు కార్మికులతో పారిశుద్ధ్య పనులను చేయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వారిని అడ్డుకోకుండా కార్మిక సంఘాల నేతలను పోలీసులు పలుచోట్ల గృహనిర్భంధం చేస్తున్నారు. ప్రయివేటు కార్మికులు పనుల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు సమ్మె చేస్తున్న కార్మికులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుంటున్నారు.


Tags:    

Similar News