ఏపీ ప్రభుత్వానికి సజ్జనార్ కీలక విజ్ఞప్తి

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఏపీ ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు.

Update: 2025-06-30 12:30 GMT

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఏపీ ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఆర్టీసీకి ఇచ్చే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను టీటీడీ పునరుద్ధరించాలని సజ్జనార్‌ కోరారు. ఇప్పటికే ఈ విషయమై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కోరినట్లు చెప్పారు. టూరిజం కోటా కింద కల్పించే ఈ సౌకర్యం ఇతర రాష్ట్రాల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, గత డిసెంబరు నుంచి టీటీడీ ఈ కోటాను రద్దు చేసిందని అన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News