హరీశ్ రావు కామెంట్స్ కు సజ్జల కౌంటర్

హరీశ్ రావు తమ ప్రభుత్వంపై అలా ఎందుకు మాట్లాడారో అర్థం కావడం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

Update: 2022-09-30 08:19 GMT

హరీశ్ రావు తమ ప్రభుత్వంపై అలా ఎందుకు మాట్లాడారో అర్థం కావడం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వాళ్ల సమస్యలు వాళ్లు చూసుకోకుండా తమ ప్రభుత్వంపై కామెంట్లు ఎందుకు అని సజ్జల ప్రశ్నించారు. హరీశ్ రావుకు ఎందుకు ఆవేశం వచ్చిందో తనకు తెలియదన్నారు. టీఆర్ఎస్ పరంగా తమను ఏమీ అనలేదన్నారు. వ్యక్తిగతంగా హరీశ్ రావుకు ఏవైనా సమస్యలున్నాయో తనకు తెలియదన్నారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య అంశం కాదన్నారు. ఒక గ్యాంగ్ ఏమంటుందో ఆ గ్యాంగ్ తో జతకట్టి హరీశ్ రావు మాట్లాడుతున్నట్లుందని సజ్జల అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఉచిత విద్యుత్తు పై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని సజ్జల అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యపై మాట్లాడితే బాగుంటుందని సూచించారు. వారి రాష్ట్రంలో సమస్యలపై దృష్టి పెడితే మంచిదని సజ్జల హితవు పలికారు. తమకు ఏపీ మాత్రమే ముఖ్యమని, ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్నారు.

ఒక వర్గం మీడియా....
2024లోనూ జగన్ ముఖ్యమంత్రి అవుతారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముప్పు భద్రాచలానికి లేదన్నారు. సాంకేతికపరమైన అంచనాలు వేసి పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని తెలిపారు. వాస్తవాలను వక్రీకరించి ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా మీడియా వ్యవహరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రయోజనాలకు భంగ కల్గితే ఒక వర్గం మీడియా ఆనందిస్తుందని అన్నారు. గడప గడప ప్రభుత్వం కార్యక్రమానికి స్పందన బాగుందన్నారు. అందరూ కలసి పనిచేయాలని జగన్ సూచించారన్నారు. మంత్రివర్గంలో మార్పులు గురించి తనకు తెలియదన్నారు.


Tags:    

Similar News