Tirumala : తిరుమలో నేటి రద్దీ ఎలా ఉందంటే? అంత తక్కువ కాకపోయినా?

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం కావడంతో కొంత తక్కువగానే ఉన్నారు

Update: 2025-04-23 03:37 GMT

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం కావడంతో కొంత తక్కువగానే ఉన్నారు. భక్తులు మాత్రం అధిక సంఖ్యలో లేరు. అలాగని తక్కువగా కూడా లేరు. కంపార్ట్ మెంట్లలో ఎక్కువ భాగం ఖాళీగానే ఉన్నాయి. దర్శనం కూడా సులువుగానే జరుగుతుంది. భక్తులు పెద్దగా వేచి ఉండకుండానే స్వామి వారి దర్శనం లభిస్తుండటంతో భక్తులు ఆనంద పడుతున్నారు. అయితే ఇక రేపటి నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.

నేడు అంగప్రదిక్షణ టోకెన్లు...
జూలై నెల అంగప్రదక్షిణం టిక్కెట్‌లు ఈరోజు ఉదయం 10:00 గంటలకు ఆన్ లైన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు. ఈ టిక్కెట్లన్నీ ఉచితంగా జారీ చేయనున్నారు. రోజువారీ కోటా 750 టిక్కెట్లు విడుదల చేయనున్నారు. శుక్రవారం మాత్రం అంగప్రదిక్షిణం అందుబాటులో లేదు.అంగప్రదక్షిణం తర్వాత దర్శనం కూడా ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు జూలై నెల 2025 లో దర్శనం మరియు వసతి కోటా బుకింగ్ కోసం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు అందుబాటులో ఉంటుందని, జూలై నెల వృద్ధులు , దివ్యాంగులుకోటా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయని టీటీడీ పేర్కొంది.
రెండు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడున్నర గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 61,828 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,165 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.61 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News