Tirumala : భక్తుల సంఖ్య తక్కువయినా హుండీ ఆదాయం మాత్రం రికార్డ్ స్థాయిలో

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం కావడంతో భక్తుల సంఖ్య గతంతో పోలిస్తే తక్కువగానే ఉంది.

Update: 2025-06-30 02:45 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం కావడంతో భక్తుల సంఖ్య గతంతో పోలిస్తే తక్కువగానే ఉంది. చాలా రోజుల తర్వాత భక్తుల రద్దీ కొంత తగ్గింది. తిరుమలకు గత రెండు నెలల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు పూర్తయిన భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా శీఘ్ర దర్శనం అయ్యేలా అధికారుల చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో క్యూ లైన్ లలో ఎక్కువ సేపు వేచి ఉండకుండా నేరుగా శ్రీవారి దర్శనం లభించేలా ఏర్పాట్లు చేశారు.

ఇతర రాష్ట్రాల నుంచి...
తిరుమలలో భక్తుల రద్దీ నిత్యం రద్దీగానే ఉంటుంది. గతంలో వేసవిలోనే రద్దీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు సెలవులతో సంబంధం లేకుండా వచ్చి తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకోనున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇటీవల ఎక్కువ మంది భక్తులు తరలి వస్తున్నారు. అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం, వసతి గృహాల వద్ద కూడా భారీగా రద్దీగా ఉండటంతో టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది.
పది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్ మెంట్లలో భక్తుల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైనో లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయమ పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 88,497 మంది భక్తుల దర్శించుకున్నారు. వీరిలో 29,054 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.34 కోట్ల రూపాయలు వచ్చింది.
Tags:    

Similar News