Tirumala : సోమవారం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందో తెలుసా?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు

Update: 2025-05-12 02:29 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. వేసవి రద్దీ తో నిత్యం కిటకిటలాడే తిరుమల వీధులు ఇటీవల దేశంలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో కొంత రద్దీ తగ్గినట్లు తెలుస్తోంది. అయితే రాను రాను వేసవి రద్దీ పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల నిత్యం రద్దీగా ఉండేది. గతంలో వేసవి కాలంలోనే రద్దీ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఎప్పుడు వీలుంటే అప్పుడు తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని భక్తులు వెళుతున్నారు.

అన్ని రకాలుగా భక్తులు...
అయితే వేసవిలో ఇంకా రద్దీ ఎక్కువగా ఉంటుందన్న కారణంగా సిఫార్సు లేఖలను కూడా స్వీకరించడం లేదు. జులై పదిహేనో తేదీ వరకూ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని, సామాన్య భక్తులు త్వరితగతిగన స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగాఈ నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మరోవైపు ముందుగా మూడు వందల రూపాయలు బుక్ చేసుకున్న భక్తులతో పాటు కాలినడకనవచ్చే భక్తులు, రోజు వారీ ఎస్.ఎస్.డి. టోకెన్లు తీసుకుని భక్తులు తిరుమలకు చేరుకుని ఏడుకొండల వాడిని దర్శించుకుంటున్నారు.
నాలుగు కంపార్ట్ మెంట్లలోనే
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 80,423 భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,361 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.40 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.





Tags:    

Similar News