Tirumala : తిరుమలకు నేడు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. నేడు సులభంగా దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో భక్తులు తక్కువగానే ఉన్నారు

Update: 2025-05-08 03:35 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో భక్తులు తక్కువగానే ఉన్నారు. అయితే వేసవి కాలంలో కావడంతో రద్దీ పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న వారితో పాటు కాలినడకన వచ్చే భక్తులు, రోజు వారీ ఎస్.ఎస్.డి. టోకెన్లు తీసుకున్న వారు కూడా తిరుమలకు చేరుకుంటుండటంతో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వేసవిలో రద్దీ ఎక్కువగానే ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు.

వేసవి రద్దీతో...
పరీక్ష ఫలితాలు రావడంతో పాటు వేసవి సెలవులు కూడా ఉండటంతో భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశముంది. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలకు ఇప్పట్లో ఒక సీజన్ లేకుండా పోయింది. ప్రతి సీజన్ లోనూ భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. అందుకే వేసవి రద్దీని తట్టుకుని సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సిఫార్సుల లేఖలను కూడా రద్దు చేశారు. జులై పదిహేనో తేదీ వరకూ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ తేల్చి చెప్పడంతో సామాన్య భక్తులకు సులువుగానే దర్శనమవుతుంది.
ఎనిమిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఎనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని71,001 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,637 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.25 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News