Tiruamala : సోమవావరం భక్తుల రద్దీ తక్కువగానే.. నేరుగా దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో తిరుమలపై కొంత ఎఫెక్ట్ పడింది. అందరూ ప్రయాగ్ రాజ్ కు వెళ్లడంతో తిరుమలకు గత కొంతకాలంగా భక్తులు రాలేదు. నిత్యం రద్దీ గా ఉండే తిరుమల జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకూ తిరుమలకు భక్తులు వచ్చే వారి సంఖ్య పరిమితంగానే ఉంది. ఫిబ్రవరి నెలలో కేవలం పదిహేను లక్షల మంది మాత్రమే స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రతి నెల కోట్లాది మందివచ్చే భక్తుల ఇంతగా తగ్గడానికి కారణం కుంభమేళా అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
భక్తుల రద్దీ తక్కువగానే...
అయితే మహాకుంభమేళా ముగిసిన తర్వాత తిరిగి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేశారు. కానీ పరీక్షల సీజన్ ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. సాధారణ క్యూ లైన్ లలో కూడా భక్తులు పెద్దగా లేకపోవడంతో తిరుమలలోని వీధులన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. గోవింద నామస్మరణలతో నిత్యం మారుమోగే తిరుమల గిరులు గత కొంత కాలంగా తక్కువ మంది భక్తులు దర్శించుకోవడంతో పాటు హుండీ ఆదాయం కూడా గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. అయితే మహా కుంభమేళా ముగియడంతో తిరిగి భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
నేరుగా దర్శనం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు లేక ఖాళీగా ఉన్నాయి. స్వామి వారిని నేరుగా దర్శనం చేసుకునే వీలుంది. ఉచిత దర్శనం క్యూలైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 69,592 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,273 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.