పెరటాసి మాసం... కిక్కిరిసిన తిరుమల

పెరటాసి మాసంతో తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు

Update: 2023-10-02 03:03 GMT

పెరటాసి మాసంతో తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. వరస సెలవులు రావడంతో పాటు పెరటాసి మాసం కావడంతో తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం ఐదు కిలోమీటర్ల మేర క్యూ లైన్ వేచి ఉంది. అయితే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా క్యూ లైన్ వద్దకే అన్న ప్రసాదం, తాగునీటిని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెచ్చి ఇస్తున్నారు.

24 గంటల్లో దర్శనం...
నిన్న తిరుమలకు 88,623 మంది భక్తులు చేరుకున్నారు. వీరిలో 43,934 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.67 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 అపార్ద్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది


Tags:    

Similar News