Tirumala :తిరుమలలో క్యూలైన్ లు ఎంత పొడవున్నాయో తెలుసా.. నేటి రద్దీ?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

Update: 2025-07-05 02:55 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సహజంగా శనివారం తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. వెంకటేశ్వరస్వామికి అత్యంత ఇష్టమైన రోజు కావడంతో శనివారాలు తిరుమలలో ఏడుకొండల వాడిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే శనివారం అత్యధికంగా భక్తులు హాజరవుతారు. శుక్రవారం నుంచి భక్తుల రద్దీ మొదలవుతుంది. శుక్ర, శని, ఆదివారాల వరకూ తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది.

రద్దీ ఎక్కువ కావడంతో...
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అన్ని కంపార్టమెంట్లు నిండిపోవడంతో క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. క్యూ లైన్ లలో ఇబ్బంది పడకుండా ఎక్కువ సేపు వేచి ఉండే వారి కోసం మొత్తం పన్నెండు అన్న ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేశారు. నిరంతరం భక్తుల దర్శనంపై అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుంది.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవైనాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,011 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్ల రూపాయలు వచ్చింది.


Tags:    

Similar News