Tirumala : తిరుమలలో తగ్గని రష్... నేడు కూడా దర్శనానికి గంటల సమయమే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు.

Update: 2025-06-25 02:46 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. గత నెలన్నర రోజులుగా భక్తుల రద్దీ తిరుమలకు ఎక్కువగా ఉంటుంది. మొక్కులు చెల్లించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

హుండీ ఆదాయం కూడా...
ప్రతి రోజూ కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. సీజన్, వారాలతో సంబంధం లేకుండా తిరుమలకు భక్తులు పోటెత్తుతుతున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం కూడా మే 15 వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. లడ్డూల విక్రయాలు కూడా పెరిగాయి. ఇక వసతిగృహాల కోసం కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు స్వామి వారి అన్నప్రసాదాలను పన్నెండు కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు అందచేస్తున్నారు.
24 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 79,466 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,227 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.



Tags:    

Similar News