Tirumala : మంగళవారం తిరుమలలో రద్దీ చూసిన వారు షాకవ్వాల్సిందే.. క్యూలైన్ లోకి వెళ్లిన వారు బయటకు వచ్చేసరికి?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు

Update: 2025-05-20 03:17 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. గత కొద్ది రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు వేసవి సెలవులు పూర్తి కావస్తుండటంతో ఇక రద్దీ రోజురోజుకూ పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ శుక్ర, శని, ఆదివారాలు మాత్రమే రద్దీ ఎక్కువగా ఉండేది. కానీ ఇకపై రోజులతో సంబంధం లేకుండా రద్దీ కొనసాగే అవకాశముందని తేలడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులు సులువుగా స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

నేడు పాలకమండలి సమావేశం...
తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం నేడు జరగనుంది. చైర్మన్ బీఅర్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరగనుంది. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి డెవలప్ మెంట్ పై పలు నిర్ణయాలు తీసుకొనున్న బోర్డు తిరుమలలోని పలు క్యాంటీన్ లకు టెండర్లు పిలిచేందుకు నిర్ణయం తీసుకునే అవకాశముంది.భక్తులకు నాణ్యమైన ఆహారం విక్రయించగల గుర్తింపు ఉన్న ప్రముఖ సంస్థలకు టెండర్ లో పాల్గొనే అవకాశం ఉంది. తిరుమలలో పలు మఠాల ఆక్రమణలపై సర్వే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయంతో పాటు పలు కీలక తీర్మానాలు చేయనుంది. దీంతో పాటు వేసవి రద్దీకి అనుగుణంగా అవరమైన ముందస్తు చర్యలు తీసుకునే అంశాలపై చర్చించనుంది.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఏటీజీహెచ్ భక్తులు బయట వరకూ క్యూ లైన్ లో వేచి ఉండి ఏడుకొండల వాడి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 79,003 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,140 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.52 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.



Tags:    

Similar News