Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? అయితే అలెర్ట్ గా ఉండాల్సిందే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది

Update: 2025-07-07 03:04 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. వేసవి కాలంలో ఇంత రద్దీ పెద్దగా లేదు. అయితే జులై నెలలో రద్దీ ఎక్కువగా ఉంది. మే 15వ తేదీ నుంచి ప్రారంభమయిన రద్దీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. బయట వరకూ క్యూ లైన్ లలో భక్తులు వేచి ఉంటున్నారు. ఏడుకొండల వాడి దర్శనానికి గంటల సమయం పడుతుంది. అయినా సరే భక్తులు రాక తగ్గడం లేదని, వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

రెండు నెలల్లో రద్దీ...
సాధారణంగా జులై నెలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. జూన్ నెలలోనే ఈసారి అత్యధిక ఆదాయం తిరుమలేశునికి వచ్చింది. ఒక్క జూన్ నెలలోనే 120 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. అంటే రోజుకు నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. భక్తులు ఈ నెలలోనూ ఎక్కువగా వస్తుండటంతో ఈ నెలంతా తిరుమల రద్దీగానే ఉంటుందని, రద్దీకి తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
న్.జి షెడ్స్ వరకూ భక్తుల క్యూ లైన్...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ ఎన్.జి షెడ్స్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలుచేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 88,938 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,548 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.39 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Tags:    

Similar News