Tirumala : తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ ఎంత ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు

Update: 2025-07-22 02:59 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్నాళ్ల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. రెండున్నర నెలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వస్తుండటంతో అవసరమైన చర్యలు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా, సులువుగా స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు క్యూ లైన్లలో ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అవసరమైన ఏర్పాట్లు...
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా పెరగడానికి కారణాలు తెలియకపోయినా వచ్చిన భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంపాలక మండలి సమావేశం కానుంది. కీలక నిర్ణయాలను తీసుకోనుంది. గత రెండు నెలల నుంచి భక్తుల సంఖ్య పెరగడంతో పాటు హుండీ ఆదాయం కూడా పెరిగింది. అయితే దీనిపై చర్చించి వసతి గృహాలతో పాటు భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనలపై కీలక నిర్ణయాలను నేడు టీటీడీ తీసుకునే అవకాశముంది.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీజీహెచ్ వరకూ క్యూ లైన్ విస్తరించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్ విస్తరించడంతో భక్తులకు మజ్జిగ, పాలు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 77,481 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,612 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.96 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.





Tags:    

Similar News