Tirumala : తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం అంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది

Update: 2025-07-16 02:50 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయటవరకూ క్యూ లైన్ లు విస్తరించి ఉండటం గత కొద్ది రోజుల నుంచి కనిపిస్తుంది. దాదాపు రెండు నెలల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. గత జూన్ నెలలో ఆదాయం గతంలో ఎప్పుడూ లేని విధంగా వచ్చిందని 120 కోట్ల రూపాయలకు పైగానే హుండీ ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

హుండీ ఆదాయం...
ఈ నెలలో కూడా భక్తుల రద్దీ తగ్గక పోవడంతో హుండీ ఆదాయం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. యావరేజ్ న రోజుకు నాలుగు కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు వెంటనే దర్శనం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
బయట వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలా తోరణం వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 73,020 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,609 మంది భక్తుల తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.19 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Tags:    

Similar News