Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. బయట వరకూ క్యూ లైన్

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది

Update: 2025-06-19 03:06 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. రేపటి నుంచి ఇంకా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. తిరుమల వీధులన్నీ భక్తులతో కిటికిటలాడుతున్నాయి. వేసవి సెలవులు పూర్తి కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుందని భావించినా గత నెల రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా సర్వ దర్శనం భక్తులకు సులువుగా దర్శనం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

గత కొన్ని రోజులుగా...
గత కొన్ని రోజులుగా తిరుమలతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలలో వసతి గృహాల సంఖ్య కూడా దొరకక అనేక మంది బయట ఉంటున్నారు. కొందరు కింద తిరుపతిలోనే వసతిని తీసుకుని వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. కాలినడకన వచ్చే భక్తులు, మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కోసం వచ్చే భక్తులు, సిఫార్సు లేఖల ద్వారా వస్తున్న భక్తులు ఇలా అన్ని రకాలుగా క్యూ లైన్లలో వేచి ఉండక తప్పడం లేదు. కంపార్ట్ మెంట్లన్నీ గత కొంతకాలం నుంచి నిండిపోయి ఉంటున్నాయి.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండి పోయి బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉదయం ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 80.440 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News