Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదా? అందుకు కారణాలివేనా?

తిరుమలోల భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది

Update: 2025-06-07 03:15 GMT

తిరుమలోల భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. గత నెల పదిహేనో తేదీ నుంచి ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. సిఫార్సు లేఖలను అనుమతించడంతో పాటు వేసవి సెలవులు ముగియనుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. అదే సమయంలో అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట వరకూ క్యూ లైన్లు విస్తరించి ఉన్నాయి. గంటల కొద్దీ స్వామి వారి దర్శన సమయం పడుతుంది. అయితే క్యూ లైన్ లో ఉన్న భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, భక్తులు కూడా తమకు సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు.

శ్రీవారి మెట్టు మార్గాన...
శ్రీవారి మెట్టు మార్గాన కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరిలో దివ్యదర్శనం టోకెన్ల జారీ తిరిగి ప్రారంభమయింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గాన కాలినడకన వెళ్లే భక్తులకు శుక్రవారం సాయంత్రం నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శనం టోకెన్ల జారీని టిటిడి ప్రారంభమైందని అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం టోకెన్ కౌంటర్లను తాత్కాలికంగా భూదేవి కాంప్లెక్స్‌కు మార్చారు. భూదేవి కాంప్లెక్స్ లో ఇప్పటికే పూర్తిస్థాయిలో ఎస్ ఎస్ డి టోకెన్లను జారీ చేసే మౌలిక సదుపాయాలు, మానవవనరులు ఒకే చోట చాలా కాలంగా ఉండడం వల్ల ఇక్కడ నుండి జారీ చేస్తున్నారు. శ్రీవారి మెట్టు టోకెన్లను జారీ చేయడానికి నాలుగు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.
హుండీ ఆదాయం మాత్రం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,174 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,192 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.88 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.



Tags:    

Similar News