Free Bus For Women : మహిళల ఉచిత బస్సు పథకం అమలుపై ఆర్టీసీ పునరాలోచనలో పడిందా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై ఆర్టీసీ అధికారులు పునరాలోచనలో పడ్డారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై కొంత పునరాలోచనలో పడింది. ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రకారం జిల్లాలకే ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తే పథకం అమలు చేసి కూడా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. జిల్లాకు, జిల్లాకు మధ్య పెద్ద దూరం లేకపోవడంతో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టామన్న పేరు తప్పించి దానివల్ల వారిలో సంతృప్తి కూడా ఉండదని గ్రహించింది. పాత జిల్లాలయితే కొంత వరకూ పరవాలేదు. అదే కొత్త జిల్లాలయితే జిల్లాలు, జిల్లాకు మధ్య దూరం పది నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. ఇందులో ప్రయాణించే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందని, అందువల్ల మహిళలకు ఉచిత బస్సు పథకం ఆకట్టుకోలేకపోతుందని అంచనా వేస్తున్నారు.
ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని...
మిగిలిన రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం జిల్లాలకే పరిమితం చేశారు. ఇప్పటికే దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చని చెప్పి అధికారంలోకి రాగానే మాట మార్చారంటూ వైసీపీ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెనక్కు పోదలచుకోలేదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో మహిళల ఉచిత బస్సు పథకాన్ని అధ్యయనం చేసినప్పుడు అక్కడ బస్సుల్లో మహిళల కొట్లాటలు, పురుషులకు కనీసం సీట్లు కూడా లేకపోవడం గుర్తించి జిల్లాలకే పరిమితం చేసింది.
నగరాల్లో మహిళలకు...
కానీ జిల్లాలకే పరిమితం చేసినా ఎక్కువగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి పట్టణాల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే వీలుంటుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆర్టీసీ అధికారులు పాత ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగానే అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై అధ్యయనం చేస్తున్నారట. ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. దాదాపు ఎనభై ఎనిమిది మంది శాతం పాత ఉమ్మడి జిల్లాల్లోనే పర్యటిస్తుండటంతో పాత పది ఉమ్మడి జిల్లాల పరిధిలో అమలు చేస్తే బాగుంటుందన్న సూచనలను కూడా ఆర్టీసీ అధికారులు పరిశీలిస్తున్నారు. దీనివల్ల అదనపు బస్ుల కొనుగోలు అవసరం కూడా పెద్దగా ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే కొత్త జిల్లాలా? పాత ఉమ్మడి జిల్ాల్లాలకే ఉచితం పరిమితం చేస్తారా? అన్న దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.