నేటి నుంచి నెల్లూరులో రొట్టెల పండగ
నేటి నుంచి నెల్లూరులో రొట్టెల పండగ జరగనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ పండగ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు
నేటి నుంచి నెల్లూరులో రొట్టెల పండగ జరగనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ పండగ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నెల్లూరు లోని బారా షాహిద్ దర్గాలో జరిగే రొట్టెలపండగ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. లక్షలాది మంది భక్తులు వచ్చి తమ కోర్కెలను తీర్చాలని రొట్టెలను సమర్పించుకుంటారు. ఇందుకోసం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పదహారు వందల మందితో పోలీసు బందోబస్తు ను ఏర్పాటు చేశారు.
ఐదు రోజల పాటు...
దర్గాతో పాటు చుట్టుపక్కల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరులో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తసీుకుంటున్నారు. ఈ రొట్టెల పండగ కోసం చెన్నై, బెంగళూరు, విజయవాడ, ఒంగోలు, తిరుపతి వంటి ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. ఈరోజు సాయంత్రం మంత్రి నారా లోకేశ్ వచ్చి దర్గా వద్ద రొట్టెను సమర్పించనున్నారు. ఏ కోరికకు సంబంధించిన రొట్టె ఆ రొట్టెను సమర్పించి తమ కోరికలను తీర్చాలని కోరుకుంటారు.