Andhra pradesh : కారు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్యే బంధువులు నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కక్కడే మృతి చెందారు.

Update: 2025-11-03 02:34 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారందరూ బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బంధువులుగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బాపట్లలోని పాండురంగాపురంలో జరిగిన సంగీత్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి తమ ఇళ్లకు వెళుతుండగగా కర్లపాలెం మండలం సత్యవతి పేట వద్ద ఈ ప్రమాదం జరిగింది.

లారీ ఢీకొట్టడంతో...
కారును లారీ వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. మృతులను ఎమ్మెల్యే బావమరిది బేతాళం బలరామరాజు, బేతాళ: లక్ష్మి, గాదిరాజు పుష్పావతి, ముదుచారి శ్రీనివాసరాజులుగా గుర్తించారు. వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలకు బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామమైన కర్లపాలెంకు తరలించారు. గ్రామంలో విషాదం నెలకొంది


Tags:    

Similar News