Kurnool Bus Accident : కుటుంబం మొత్తం సజీవ దహనం
కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కుటుంబం మృతి చెందింది
కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కుటుంబం మృతి చెందింది. నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్ కుటుంబం మృతి చెందింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతూ ఈ కుటుంబం మొత్తం మరణించింది. భర్త రమేష్ తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు కూడా కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. నెల్లూరుకు చెందిన రమేష్ కుటుంబం బెంగళూరు లో స్థిరపడింది.
బెంగళూరులో స్థిరపడి...
పదిహేనేళ్ల క్రితం బెంగళూరులో స్థిరపడిన రమేష్ కుటుంబం హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి బెంగళూరుకు వేమూరి కావేరి బస్సులో బయలుదేరింది. వింజమూరు మండలానికి చెందిన గొల్లవారి పాలెం గ్రామానికి చెందని గోళ్ల రమేష్ కుటుంబం భార్య అనూషతో పాటు ఇద్దరు పిల్లలతో పాటు అందరూ మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.