Vijayawada : విజయవాడకు మళ్లీ వరద ముప్పు పొంచి ఉందా? కుండపోత వర్షాలతో?
వర్షం కురుస్తుందన్నా... తుపాను అని ప్రకటన విన్నా విజయవాడ వాసులు భయపడిపోతున్నారు
వర్షం కురుస్తుందన్నా... తుపాను అని ప్రకటన విన్నా విజయవాడ వాసులు భయపడిపోతున్నారు గత కొద్ది రోజులుగా విజయవాడలో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని, దానికి శక్తి తుపానుగా అధికారులు నామకరాణం చేశారు. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన చేశారు. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీచేశారు. ఈరోజు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. ఆ అల్పపీడనం తీవ్ర శక్తి తుఫాన్ గా మారి ఉరుములు, మెరుపులు, భారీ పిడుగులతో కూడిన ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఉన్న అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
శక్తి తుఫాన్ ప్రభావంతో...
శక్తి తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై శక్తి తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. గతంలో భారీ వర్షాలతో బుడమేరు వాగు పొంగి విజయవాడను ముంచెత్తింది. ఇప్పుడు శక్తి తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా విజయవాడకు ఆనుకుని ఉన్న మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో బెజవాడ వాసులు బెంబేలెత్తుతున్నారు. గతంలో జరిగిన నష్టాన్ని పడిన బాధలను తలచుకుని వణికిపోతున్నారు.
మున్నేరు వాగు పొంగి...
విజయవాడలో మున్నేరు వాగు భారీ వర్షాల సమయంలో ఉప్పొంగి, వరదలు మరియు రాకపోకల అంతరాయాలకు కారణమవుతుంది. మున్నేరు వాగు విజయవాడ మీదుగా ప్రవహించి, నగరంలోని పలు ప్రాంతాలకు వస్తుంది. దీంతో భారీ వర్షాలు పడితే మళ్ళీ విజయవాడకు ముప్పు పొంచి ఉందేమోనన్న భయం పట్టుకుంది. శక్తి తుపాను ప్రభావం ఏడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో బెజవాడ వాసులు భయం గుప్పిట్లో బితుకుబితుకుమంటూ గడుపుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.