Andhra Pradesh : పరకామణి పై నివేదిక హైకోర్టుకు

పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సీల్డ్‌ కవర్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదిక తెలిపింది.

Update: 2025-12-02 07:37 GMT

పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సీల్డ్‌ కవర్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదిక తెలిపింది. సీల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు నివేదిక సీఐడీ సమర్పించింది. నిందితుడు రవికుమార్‌ ఆస్తులపై ఏసీబీ అధికారులు నివేదిక సమర్పించారు. నివేదికలను తమ ముందు ఉంచాలని రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నివేదికను అందచేయాలని...
నివేదికను అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని రవికుమార్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కోరారు. అయితే న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు న్యాయమూర్తి తోసిపుచ్చారు. పరకామణి చోరీ కేసులో తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. పరకామణి చోరీ కేసులో ఇప్పటికే కొందరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News