Vallabhaneni Vamsi : నేటితో ముగియనున్న వంశీ రిమాండ్
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ నేటితో ముగియనుంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ నేటితో ముగియనుంది. వల్లభనేని వంశీ సహా మరో నలుగురు నిందితుల రిమాండ్ ముగియనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దాదాపు మూడు నెలల నుంచి వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వల్లభనేని వంశీపై వరస కేసులు నమోదయ్యాయి.
అనేకకేసులు...
ఇసుక అక్రమ కేసుతో పాటు కిడ్నాప్, బెదిరింపులు, భూకబ్జా కేసులు కూడా నమోదయ్యాయి. అయితే టీడీపీ కార్యలయంపై దాడి కేసులో నేటితో రిమాండ్ ముగియనుండటంతో నిందితులను ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీ ఇటీవల అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తీసుకు వచ్చివైద్య పరీక్షలు చేసి చికిత్స అందించారు.