Andhra Pradesh : రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. సర్వర్ల మొరాయింపు

ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు రేపటి నుంచి పెరగనున్నాయి. కొత్త మార్కెట్ విలువలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి

Update: 2025-01-31 03:42 GMT

ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు రేపటి నుంచి పెరగనున్నాయి. కొత్త మార్కెట్ విలువలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. దాదాపు పదిశాతం ఛార్జీలు పెరుగుతాయని భావిస్తున్నారు. రాజధాని అమరావతి గ్రామాలను మినహాయించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. కొన్నిచోట్ల ఇరవై శాతం వరకూ పెరిగే అవకాశముండటంతో ప్రజలు నిన్నటి నుంచే రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూ కట్టారు.

నేడు మరింత రద్దీ...
అనేక చోట్ల రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సర్వర్లు మొరాయించాయి. ఒక్కసారిగా ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ కు రావడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కొత్త మార్కెట్ విలువల అమలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లను ఆదేశించడంతో రేపటి నుంచి ధరలు మరింతగా పెరగనున్నాయి. దీంతో నేటి అర్థరాత్రి వరకూ జోరుగా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.


Tags:    

Similar News