వైకుంఠద్వార దర్శనం ఈ ఏడాది తిరుమలకు ఎంత మంది వచ్చారంటే?
తిరుమలలోని వైకుంఠద్వార దర్శనాలకు ఈ ఏడాది అత్యధికంగా 7.83 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు
తిరుమలలోని వైకుంఠద్వార దర్శనాలకు ఈ ఏడాది అత్యధికంగా 7.83 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. కేవలం పది రోజుల్లో శ్రీవారికి రూ.41.14 కోట్ల కానుకలు వచ్చాయి - ఈ సారి వైకుంఠద్వార దర్శనాల్లో 44 లక్షల లడ్డూలు విక్రయించారు. గతేడాది కంటే 27% అధికంగా భక్తులకు అన్నప్రసాదం వితరణ జరిగిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
రెండు లక్షల మందికి పైగా...
భక్తులకు వెయ్యి మంది సిబ్బంది అన్నప్రసాద పంపిణీ చేశారన్నారు. సామాన్య భక్తులకు అధిక సంఖ్యలో వసతి గదులు కేటాయించామని తెలిపారు. తొలి 3 రోజులు టోకెన్ కలిగిన భక్తులకు దర్శనం కల్పించామని, శ్రీరంగనాథస్వామి ఆలయ సెట్ భక్తులను ఎంతో ఆకట్టుకుందని, శ్రీవారి అలంకరణకు 50 టన్నుల పుష్పాలు వినియోగించామన్నారు. రెండు లక్షలకు పైగా భక్తులు తలనీలాలు సమర్పించారని, క్యూలైన్ నిర్వహణతో అంచనాలకు మించి దర్శనాలు కల్పించగలిగామని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు.