రాజధాని అంశాన్ని మాకు వదిలేయండి

రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభలో నిలదీశారు

Update: 2023-02-07 12:04 GMT

రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభలో నిలదీశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో డిమాండ్ చేశారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఏపీికి ఇవ్వాలని నాడు వెంకయ్యనాయుడు డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీని తర్వాత వచ్చిన ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ తాము ఇచ్చిన హామీలు మరిచిపోయాయన్నారు.

ఎక్కడ ఉండాలో...?
రాజధాని ఎక్కడో నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకునేలా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందన్నారు. యూపీ, ఛత్తీస్‌గడ్ లలో హైకోర్టులు ఎక్కడ ఉన్నాయన్నది తెలుసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ సర్కారు పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తుందన్నారు. విశాఖ మెట్రోకు కేంద్రం ఇంతవరకూ నిధులు విడుదల చేయలేదన్నారు.


Tags:    

Similar News