లిక్కర్ స్కాంలో ఆంధ్రా మూలాలు

లిక్కర్ స్కాంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మూలాలు వెలుగు చూస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు

Update: 2022-08-24 07:10 GMT

లిక్కర్ స్కాంపై ఢిల్లీలో డొంక కదిలితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మూలాలు వెలుగు చూస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. లిక్కర్ స్కాంలో రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీకి సబంధాలున్నాయని తెలుస్తుందన్నారు. దీనిపై ఈ ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని జీవీఎల్ ప్రశ్నించారు. లేపారి నాలెడ్జ్ హబ్ పేరుతో హిందూపురంలోని 4,200 ఎకరాలు బ్యాంకులకు తనఖా పెట్టారని ఆయన ఆరోపించారు. వాటిని ఐదు వందల కోట్లకే ప్రయివేటు సంస్థ చేజిక్కించుకోవడం వెనక ఎవరి ప్రమే‍యం ఉందని ఆయన ప్రశ్నించారు. లేపాక్షి పెద్ద ల్యాండ్ స్కామ్ అని ఆయన ఆరోపించారు. విశాఖ - చెన్నై ఇండ్రస్ట్రియల్ క్యారిడార్ ను ఈ ప్రభుత్వం పూర్తిగా మూలన పడేసిందని జీవీఎల్ నరసింహారావు అన్నారు.

ఓట్లు గల్లంతు...
రాష్ట్రంలో బీజేపీ సభ్యులు అనగానే వారికి పథకాలను కట్ చేస్తున్నారని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. రేషన్ కార్డులను తొలగించడం, పెన్షన్లను రద్దు చేయడం జరుగుతుండటం తమ దృష్టికి వచ్చిందన్నారు. పెద్ద సంఖ్యలో ఓటర్లను కూడా జాబితా నుంచి తొలగించారని, యాభై వేల ఓట్లు గల్లంతయ్యాయని, దీనిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఓటర్లను తొలగించారన్నారు.


Tags:    

Similar News