నేడు రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటీషన్ పై విచారణ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి నేడు రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి నేడు రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది. లిక్కర్ స్కాం కేసులో రాజ్ కేసిరెడ్డిని ప్రధాన నిందితుడిగా భావించి స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు పలు మార్లు విచారించారు. కీలక విషయాలను సేకరించారు.
లిక్కర్ స్కామ్ కేసులో...
ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విజయవాడ జిల్లా జైలులో ఆయన ఉన్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన సిట్ అధికారుల మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశముంది. అయితే నేడు విజయవాడ కోర్టులో రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటీషన్ పై ఎలాంటి తీర్పు రానుందన్నది తెలియాల్సి ఉంది. రేపు ఇదే కేసులో చాణక్య బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.