Breaking : ఆ దొరికిన డబ్బుతో తనకు సంబంధం లేదు : రాజ్ కేసిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో దొరికిన పదకొండు కోట్ల రూపాయలతో తనకు సంబంధం లేదని ఈ కేసులో నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఏసీబీ కోర్టులో అఫడవిట్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో దొరికిన పదకొండు కోట్ల రూపాయలతో తనకు సంబంధం లేదని ఈ కేసులో నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఏసీబీ కోర్టులో అఫడవిట్ దాఖలు చేశారు. బెయిల్ పిటీషన్ వేస్తానని సిట్ అధికారులు తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాచారంలో పట్టుబడిన నగదుపై తన గురించి సిట్ అధికారులు అసత్య ఆరోపణలు చేస్తుందని అఫడవిట్ లో పేర్కొన్నారు. తనను ఇరికించే ప్రయత్నం సిట్ అధికారులు చేస్తున్నారని అన్నారు.
సిట్ మాత్రం...
రాజ్ కేసిరెడ్డితో పాటు విజయేంద్ర రెడ్డితో లిక్కర్ కేసులో సంబంధాలున్నాయన్న సమాచారం మేరకు తాము దాడులు చేశామని, పదకొండు కోట్ల రూపాయల నగదును సీజ్ చేశామని సిట్ అధికారులు చెబుతున్నారు. ఫాం హౌస్ ఓనర్ విజయేంద్రకు చాలా వ్యాపారాలున్నాయని, ఆడబ్బుతో తనకు సంబంధం లేదని మాత్రం రాజ్ కేసిరెడ్డి తెలిపారు. వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాల యజమాని విజయేంద్ర రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లోనే దొరికిందని, యూవీ డిస్టలరీస్ కు చెందినదిగా సిట్ అధికారులు తెలిపారు.