నేడు మరోసారి సిట్ విచారణ

మద్యం స్కామ్ కేసులో నేడు సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డి హాజరవ్వాల్సి ఉంది

Update: 2025-04-21 06:07 GMT

మద్యం స్కామ్ కేసులో నేడు సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డి హాజరవ్వాల్సి ఉంది. సిట్ అధికారులు మరోసారి ఉపేంద్ర రెడ్డిని విచారణకు పిలపిలిచారు. ఈరోజు విచారణకు రావాలని ఉపేంద్రరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే రెండు రోజుల పాటు విచారించిన సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి ఎక్కడ ఉన్నాడన్న దానిపైనే ఎక్కువగా ప్రశ్నలు వేశారు.

తనకు సమాచారం ఇవ్వలేదని...
అయితే రాజ్ కసిరెడ్డి గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని ఎన్ని ప్రశ్నలు అడిగినా అదే చెప్పారు. తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో తెలియదని ఎన్ని ప్రశ్నలు వేసినా అదే చెబుతుండటంతో నేడు మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం కనిపించకపోవడంతో ఉపేంద్ర రెడ్డిని పిలిచారు.


Tags:    

Similar News