రాజ్ కసిరెడ్డి నేడు విచారణకు రానున్నారా?
హైకోర్టులో మరోసారి రాజ్ కసిరెడ్డి పిటిషన్ వేశారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు
హైకోర్టులో మరోసారి రాజ్ కసిరెడ్డి పిటిషన్ వేశారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. కసిరెడ్డి పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే ఇప్పటి వరకూ రాజ్ కసిరెడ్డి కోసం సిట్ అధికారులు నాలుగు సార్లు నోటీసులు జారీ చేశారు. ఆయన తండ్రిని విచారించినప్పటికీ ఎటువంటి సమాచారం రాలేదని తెలిసింది.
హైకోర్టును ఆశ్రయించిన...
రాజ్ కసిరెడ్డి కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఆయన ఇళ్లు, కార్యాలయాలతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లతో పాటు కొన్ని ముఖ్యమైన హార్డ్ డిస్క్ లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే నేడు సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి హాజరుకావడంపై సందిగ్ధత నెలకొంది.