పోసాని డ్రామా ఆడారు

సినీ నటుడు పోసాని కృష్ణమురళి డ్రామా ఆడారని రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Update: 2025-03-01 12:33 GMT

సినీ నటుడు పోసాని కృష్ణమురళి డ్రామా ఆడారని రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. తనకు ఛాతీ నొప్పి ఉందని పోసాని కృష్ణమురళి చెప్పడంతో వెంటనే ఆయనను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు. పోసాని అడిగిన అన్ని పరీక్షలను వైద్యుల చేత చేయించామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఎలాంటి అనారోగ్యం లేదు..
అయితే పోసాని కృష్ణమురళికి ఎలాంటి అనారోగ్యం లేదని వైద్యులు ధృవీకరించారని, అన్ని పరీక్షల్లో ఫలితాలు నార్మల్ గానే వచ్చాయని తెలిపారు. ఛాతీ నొప్పి అని డ్రామా ఆడటంతోనే పరీక్షలన్నీ చేయించామని, వైద్య పరీక్షల్లో అలాంటిదేమీ లేదని తేలడంతో ఆయనను తిరిగి సబ్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.


Tags:    

Similar News