రాజంపేటవాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

రాజంపేటవాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాజంపేటలో హజరత్ నిజాముద్దీన్ ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ స్టాపింగ్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Update: 2025-06-11 06:33 GMT

రాజంపేటవాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాజంపేటలో హజరత్ నిజాముద్దీన్ ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ స్టాపింగ్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన స్టాపింగ్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రకటించారు.

ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఆగడంతో...
గుంతకల్ రైల్వే డివిజన్ లో 470 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరలో కడప-బెంగళూరు రైల్వే మార్గం పూర్తికానుందని, కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ ఆగడం రాజంపేట వాసులకు తీపికబురు అని ఆయన అన్నారు.


Tags:    

Similar News